Sunday, January 10, 2010

ఎవడి గోల వాడిది........ తెలంగాణా పై...........

గత నెల రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎటు వైపు వెళ్తున్నాయో అర్థం కావడం లేదు. ఏ వార్తా పత్రిక చుసిన, ఏ టీవీ ఛానల్ పెట్టిన కనిపించే అంశం ఒక్కటే. అది ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు. ఈ తెలంగాణా అంశం చర్చకు రాకముందు మీడియా లో నలుగుతూన్న అంశం ఓబులాపురం గనుల అక్రమాలు. ఇప్పుడు దాని గురించి పట్టించుకునే పత్రిక గానీ, న్యూస్ ఛానల్ గాని లేదు. బహుశ ఈ కోట్లు గడించే అక్రమాలను మీడియా నుండి తప్పించడానికే చాలా చిన్నదిగా సాగిన తెలంగాణా అంశాన్ని బూతద్దంలో పెట్టి పెద్దదిగా కనిపించేలా చేసారేమో. తెలంగాణా అంశం చర్చకు వచ్చిన తరువాత వచ్చిన N. D. తివారి రాసలీలలు, రాజశేకర్ రెడ్డి మరణ సంగటనలో అంబానీల హస్తం లాంటివి ఏవి తెలంగాణా అంశాన్ని పక్క తోవ పట్టించలేకపోయాయి. ఇదిలా పక్కన పెడితే........
అసలు ఈ రాజకీయనాయకులకు తెలంగాణాకు గానీ, సమైక్యాంధ్రకు గానీ మద్దతు పలికే అధికారం ఎవరిచ్చారు?? అవును ప్రజలే వారిని ఎన్నుకొని వారికి ఆ అధికారాన్ని ఇచ్చారు. కాని ఆ అధికారాన్ని ఉపయోగించి, రాష్ట్ర విభజన లాంటి అతి ప్రాముక్యమైన అంశం పై వారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చా ?? ఒక్కసారి ఆలోచించండి?? ప్రతి రాజకీయ నాయకుడు తన స్వలాభం కోసమో గానీ, తమ పార్టీ ప్రయోజనలకో గానీ మద్దతించడం లేదా వ్యతిరేకించడం జరుగుతుంది. నిజంగా ఎంత మంది రాజకీయ నాయకులు తమ నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకున్నారు?? ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమను తామే పరిపలించుకునే ఒక వ్యవస్థ అని ఎంత మంది రాజకీయ నాయకులకు గుర్తుందంటారు..........

No comments:

Post a Comment